![]() |
![]() |
.webp)
సినిమా హీరో, హీరోయిన్ లకి ఏ రేంజ్ లో అభిమానులుంటారో కొన్ని బుల్లితెర సీరియల్స్ లోని హీరో, హీరోయిన్ లకి అదే రేంజ్ లో అభిమానులుంటారు. వేద-యష్ ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ కి ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అలాగే బ్రహ్మముడి రాజ్-కావ్య, గుప్పెడంత మనసులోని రిషి-వసుధార, కృష్ణ ముకుంద మురారీలకి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. అయితే వీటితో పాటు త్రినయనికి, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కస్తూరికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అంతే ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది నిండు నూరేళ్ళ సావాసం హీరోయిన్ పల్లవి గౌడ.
పసుపు కుంకుమ, సావిత్రి మొదలైన సీరియల్స్ లో నటించిన పల్లవి గౌడ అందరికి సుపరిచితమే.. అయితే కొన్ని సంవత్సరాలుగా రెస్ట్ తీసుకున్న పల్లవి గౌడ.. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీగా చేసిన సీరియల్... 'నిండు నూరేళ్ళ సావాసం'. పల్లవి గౌడ కన్నడ నటి.. తెలుగులో పసుపు కుంకుమ, సావిత్రి సీరియల్స్ చేసిన తర్వాత కన్నడలో గాలిపాట, పరిణయ, శాంతం పాపం వంటి సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత తెలుగులో చదరంగం, సూర్యకాంతం సీరియల్స్ లో నటించింది పల్లవి గౌడ. అయితే సీరియల్స్ తో పాటు పలు కన్నడ సినిమాలలో నటించిన పల్లవి గౌడ.. రెండు రాష్ట్రాలు, అమ్మ ఆవకాయ అంజలి లాంటి తెలుగు వెబ్ సిరీస్ లలో నటించింది. అయితే చాలా గ్యాప్ తర్వాత 'నిండు నూరేళ్ళ సావాసం' తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది పల్లవి గౌడ.
ఇక తన కొత్త సీరియల్ ఏమండోయ్ శ్రీవారు తాజాగా మొదలైంది. ఈ సీరియల్ ని చూసిన తన తెలుగు అభిమానులు వందాలది మెసెజ్ లు చేసారంట. ఇక ఆ మెసెజ్ లన్నింటిని స్క్రీన్ షాట్ లు తీసి తన ఇన్ స్ట్రాగ్రామ్ ప్రొఫైల్ లో అప్లోడ్ చేస్తుంది. అందులో ఓ అభిమాని రాసిన లేఖ తనకి చాలా నచ్చిందంటూ చెప్పుకొచ్చింది. పల్లవి పల్లవి నా పాటకు శృతిగానాలు నువ్వు వినిపిస్తావా.. నీ అందంతో పల్లవిని చరణంలాగా నా మనసుకి వినిపిస్తావా.. ఓ ఆగాధజలముల మధ్య నిన్ను చూసిన వేళ నన్ను నేను మరిచిన సివంగివి నువ్వు. నువ్వు నా మనుసు తాకే సివంగి నటన మరవకముందే మహానటి 'సావిత్రి' లాగా వచ్చిన మీ ప్రదర్శన 'చదరంగం' లా ఎత్తుకి పైఎత్తు వేసే 'అంచిక' ని చూపించింది. మునుపెన్నడూ చూడని మరో కొత్త కోణంలో మా ఆశలు ఆరని కార్తీక దీపంలా.. నిండు నూరేళ్ళు మీతో నా సావాసం అంటూ అమ్మ ప్రేమను ఆత్మరూపంలో చూపిస్తూ మా హృదయాల తాకిన ఈ అరుంధతిని చూసి తరింపమ అది కూడా మన జీ తెలుగులో.. అంటు ఓ అభిమాని రాసిన ఈ లేఖ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది పల్లవి గౌడ. కాగా ఇది తనకి చాలా నచ్చిందంటూ థాంక్స్ చెప్పింది పల్లవి గౌడ.
![]() |
![]() |